జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ పోటాపోటీ
జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఇరు పార్టీలు చెరో 23 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రంలో బీజేపీ, పీడీపీ ఒక్కో ప్రాంతానికే పరిమితం కావడం గమనార్హం. జమ్మూలో బీజేపీ దాదాపు మూడింటి రెండొంతుల స్థానాల్లో సత్తాచాటగా, కశ్మీర్లో పీడీపీ సగం స్థానాల్లో సొంతం చేసుకోనుంది. కశ్మీర్లో బీజేపీ కేవలం రెండు స్థానాల్లో, జమ్మూలో పీడీపీ కూడా రెండు చోట్ల మాత్రమే ముందంజలో ఉన్నాయి.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో 87 సీట్లుండగా, జమ్మూలో 37, కశ్మీర్లో 46 నియోజకవర్గాలున్నాయి. లడఖ్ ప్రాంతంలో 4 ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మూడు, నాలుగు స్థానాలకు పరిమితమైనా.. .. రెండు ప్రాంతాల్లోనూ చెప్పుకోదగ్గ స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక లడఖ్ ప్రాంతంలో నాలుగు పార్టీలు ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








